ॐ श्री परमात्मने नमः अथ दशमोऽध्यायः
विभूतियोगः
ఓం శ్రీ పరమాత్మనే నమః అథ దశమోధ్యాయః
విభూతియోగః

Om Sri Paramatmane Namah
This marks the beginning of tenth chapter – The Yoga of Divine Glories

The Yoga of Divine Manifestations.
श्री भगवानुवाच
भूय एव महाबाहो श्रृणु मे परमं वचः।
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया।।10.1।।
శ్రీ భగవానువాచ:
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః |
యత్తే௨హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా।।10.1।।
श्रीभगवान् ने कहा — हे महाबाहो ! पुन: तुम मेरे परम वचनों का श्रवण करो, जो मैं तुझ अतिशय प्रेम रखने वाले के लिये हित की इच्छा से कहूँगा.శ్రీభగవాన్ ఉవాచ — ఓ మహాబాహో! నా దివ్య ఉపదేశాన్ని మళ్లీ వినుము, నీ శ్రేయస్సుకోరి శ్రేష్ఠమైన వాక్యం మళ్ళీ చెబుతున్నాను విను.

śhrī bhagavān uvācha
bhūya eva mahā-bāho śhṛiṇu me paramaṁ vachaḥ
yatte ’haṁ prīyamāṇāya vakṣhyāmi hita-kāmyayā।।10.1।।

The Blessed Lord said — O mighty-armed one! Listen again to My supreme words, which I shall speak for your benefit, as you are dearly beloved to Me.
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः।
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः।।10.2।।
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః |
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః।।10.2।।
मेरी उत्पत्ति (प्रभव) को न देवतागण जानते हैं और न महर्षिजन; क्योंकि मैं सब प्रकार से देवताओं और महर्षियों का भी आदिकारण हूँ.నా ఆవిర్భావాన్ని దేవతలు గానీ, మహర్షులు గానీ తెలుసుకోలేరు; ఎందుకంటే నేను అన్ని విధాలా దేవతలకూ, మహర్షులకూ ఆదికారణం.

na me viduḥ sura-gaṇāḥ prabhavaṁ na maharṣhayaḥ
aham ādir hi devānāṁ maharṣhīṇāṁ cha sarvaśhaḥ।।10.2।।

Neither the gods nor the great sages know My origin, for I am, in every way, the source of the gods and the sages.
यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम्।
असम्मूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते।।10.3।।
యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే।।10.3।।
 जो मुझे अजन्मा, अनादि और लोकों के महान् ईश्वर के रूप में जानता है, र्मत्य मनुष्यों में ऐसा संमोहरहित (ज्ञानी) पुरुष सब पापों से मुक्त हो जाता है।నన్ను అజన్ముడిగా, ఆదిలేనివాడిగా, లోకాల యొక్క మహేశ్వరుడిగా ఎవడు తెలిసికొంటాడో, అటువంటి మోహరహితుడు — మానవుల్లో జ్ఞానియైనవాడు — సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు.

yo māmajam anādiṁ cha vetti loka-maheśhvaram
asammūḍhaḥ sa martyeṣhu sarva-pāpaiḥ pramuchyate।।10.3।।

He who knows Me as unborn, without beginning, and the great Lord of all worlds—such a person, free from delusion among mortals, becomes free from all sins.
बुद्धिर्ज्ञानमसंमोहः क्षमा सत्यं दमः शमः।
सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च।।10.4।।
బుద్ధిర్‌జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దుఃఖం భవో௨భావో భయం చాభయమేవ చ।।10.4।।
बुद्धि, ज्ञान, मोह का अभाव, क्षमा, सत्य, दम (इन्द्रिय संयम), शम (मन: संयम), सुख, दु:ख, जन्म और मृत्यु, भय और अभय।।బుద్ధి, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం, దుఃఖం, జననం, మరణం, భయం, నిర్భయం

buddhir jñānam asammohaḥ kṣhamā satyaṁ damaḥ śhamaḥ
sukhaṁ duḥkhaṁ bhavo ’bhāvo bhayaṁ chābhayameva cha।।10.4।।

Intellect, knowledge, absence of delusion, patience, truth, control over external and internal senses, pleasure, pain, birth, death, fear, and fearlessness.
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः।
भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः।।10.5।।
అహింసా సమతా తుష్టిః తపో దానం యశో௨యశః |
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ।।10.5।।
अहिंसा, समता, सन्तोष, तप, दान. यश और अपयश ऐसे ये प्राणियों के नानाविध भाव मुझ से ही प्रकट होते हैं |అహింస, సమదృష్టి, సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి వంటి వివిధ భావాలు ప్రాణులకు వాటివాటి కర్మానుసారం నా వల్లనే కలుగుతున్నాయి.

ahinsā samatā tuṣhṭis tapo dānaṁ yaśho ’yaśhaḥ
bhavanti bhāvā bhūtānāṁ matta eva pṛithag-vidhāḥ।।10.5।।

Non-violence, equal vision, contentment, austerity, charity, fame, and infamy — such various states arise in living beings according to their karma, and all of them originate from Me.
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा।
मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः।।10.6।।
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః।।10.6।।
सात महर्षिजन, पूर्वकाल के चार (सनकादि) तथा मनु ये मेरे प्रभाव वाले मेरे संकल्प से उत्पन्न हुए हैं, जिनकी संसार (लोक) में यह प्रजा है।।ఏడు మహర్షులు, పూర్వకాలంలోని నలుగురు (సనకాదులు), మరియు మనువు — వీరంతా నా సంకల్పబలంతోనే నా నుండి ఉద్భవించారు. ఈ ప్రపంచంలోని ప్రజలు వీరినుంచే ఉద్భవించారు.

maharṣhayaḥ sapta pūrve chatvāro manavas tathā
mad-bhāvā mānasā jātā yeṣhāṁ loka imāḥ prajāḥ।।10.6।।

The seven great sages, the four ancient sages like Sanaka and Sanandana, and the Manus were all born from My mind through the power of My will. From them, all the people of this world have descended.
एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः।
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः।।10.7।।
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |
సో௨వికంపేన యోగేన యుజ్యతే నా௨త్ర సంశయః।।10.7।।
जो पुरुष इस मेरी विभूति और योग को तत्त्व से जानता है, वह पुरुष अविकम्प योग (अर्थात् अविचल भक्तियोग) से युक्त हो जाता है, इसमें कुछ भी संशय नहीं है।।నా సృష్టి మహిమనూ, యోగశక్తినీ యథార్థంగా ఎరిగినవాడికి నిశ్చయంగా నిశ్చలమైన యోగసిద్ధి కలుగుతుంది, ఇందులో  ఎటువంటి సందేహం లేదు

etāṁ vibhūtiṁ yogaṁ cha mama yo vetti tattvataḥ
so ’vikampena yogena yujyate nātra sanśhayaḥ।।10.7।।

He who truly knows My divine glories (vibhūti) and yoga in essence, is united with unwavering devotion — of this, there is no doubt.
अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते।
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः।।10.8।।
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః।।10.8।।
मैं संसारमात्रका प्रभव (मूलकारण) हूँ, और मुझसे ही सारा संसार प्रवृत्त हो रहा है अर्थात् चेष्टा कर रहा है इस प्रकार जानकर बुधजन भक्ति भाव से युक्त होकर मुझे ही भजते हैं.సర్వజగత్తుకూ నేనే మూలకారణమనీ, నా వల్లనే సమస్తం నడుస్తున్నదనీ గ్రహించే బుద్ధిమంతులు నన్ను భక్తిభావంతో భజిస్తారు.

ahaṁ sarvasya prabhavo mattaḥ sarvaṁ pravartate
iti matvā bhajante māṁ budhā bhāva-samanvitāḥ।।10.8।।

I am the source of all creation; everything proceeds from Me. Knowing this deeply, the wise worship Me with wholehearted devotion.
मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम्।
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च।।10.9।।
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ |
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ।।10.9।।
मुझमें ही चित्त को स्थिर करने वाले और मुझमें ही प्राणों (इन्द्रियों) को अर्पित करने वाले भक्तजन, सदैव परस्पर मेरा बोध कराते हुए, मेरे ही विषय में कथन करते हुए सन्तुष्ट होते हैं और रमते हैं।।చిత్తాన్ని నాలో స్థిరపరిచి, ప్రాణశక్తిని నాకే అర్పించిన భక్తులు, ఎల్లప్పుడూ పరస్పరం నా మహిమలను వివరించుకుంటూ, నా గురించి చర్చించుకుంటూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు.

mach-chittā mad-gata-prāṇā bodhayantaḥ parasparam
kathayantaśh cha māṁ nityaṁ tuṣhyanti cha ramanti cha।।10.9।।

With minds fixed on Me and lives surrendered to Me, My devoted ones constantly enlighten one another about Me, and always speak of Me — rejoicing and delighting in Me.
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम्।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते।।10.10।।
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే
।।10.10।।
उन (मुझ से) नित्य युक्त हुए और प्रेमपूर्वक मेरा भजन करने वाले भक्तों को, मैं वह ‘बुद्धियोग’ देता हूँ जिससे वे मुझे प्राप्त होते हैं.నాతో ఎల్లప్పుడూ ఏకత్వంగా ఉండి, ప్రేమతో నన్ను భజించే భక్తులకు బుద్ధియోగం ప్రసాదిస్తాను, దానిచేత వాళ్ళు నన్ను చేరగలుగుతారు.

teṣhāṁ satata-yuktānāṁ bhajatāṁ prīti-pūrvakam
dadāmi buddhi-yogaṁ taṁ yena mām upayānti te।।10.10।।

To those ever steadfast in devotion, who worship Me with love, I grant the wisdom of yoga (buddhi-yoga) by which they come to Me.
तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता।।10.11।।
తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః |
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా।।10.11।।
उनके ऊपर अनुग्रह करने के लिए मैं उनके अन्त:करण में स्थित होकर, अज्ञानजनित अन्धकार को प्रकाशमय ज्ञान के दीपक द्वारा नष्ट करता हूँ।వారిపై కృప చూపడం కోసం, నేను వారి హృదయంలో ఉండి, అజ్ఞానము వలన కలిగిన అంధకారాన్ని జ్ఞానరూపమైన దీపంతో తొలగిస్తున్నాను.

teṣhām evānukampārtham aham ajñāna-jaṁ tamaḥ
nāśhayāmyātma-bhāva-stho jñāna-dīpena bhāsvatā।।10.11।।

In order to show them My compassion, I dwell in their hearts and destroy the darkness born of ignorance with the radiant lamp of knowledge.
अर्जुन उवाच
परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान्।
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम्।।10.12।।
అర్జున ఉవాచ:
పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్।।10.12।।
अर्जुन ने कहा
आप -परम ब्रह्म, परम धाम और परम पवित्र हंै; सनातन दिव्य पुरुष, देवों के भी आदि देव, जन्म रहित और सर्वव्यापी हैं

అర్జునుడు పలికెను -నీవు పరబ్రహ్మావి, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. నీవు శాశ్వతుడవు, దివ్యమైన పురుషుడవు, దేవతలకూ ఆదిదేవుడవు. నీవు అజన్ముడవు, సర్వవ్యాపిగా అనంతంగా విస్తరించి ఉన్నవాడవు.

arjuna uvācha
paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān
puruṣhaṁ śhāśhvataṁ divyam ādi-devam ajaṁ vibhum
।10.12।।

Arjuna said — You are the Supreme Brahman, the Supreme Abode, and the Supreme Purifier. You are the eternal, divine Person, the primal God, unborn, and all-pervading.
आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा।
असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे।।10.13।।
ఆహుస్త్వామ్ ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే।।10.13।।
ऐसा आपको समस्त ऋषिजन कहते हैं;  वैसे ही देवर्षि नारद, असित, देवल ऋषि तथा व्यास और स्वयं आप भी मेरे प्रति कहते हैं।।సకల ఋషులూ, దేవర్షి నారదుడు, అలాగే అసితుడు, దేవళుడు, వ్యాసుడు నిన్ను ఈ విధంగానే వివరించారు. నీవు స్వయంగా కూడా నాకు అలాగే చెబుతున్నావు

āhus tvām ṛiṣhayaḥ sarve devarṣhir nāradas tathā
asito devalo vyāsaḥ svayaṁ chaiva bravīṣhi me।।10.13।।

All the sages, including the divine sage Narada, as well as Asita, Devala, and Vyasa, have declared You to be thus. And now, You Yourself are telling me the same.
सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव।
न हि ते भगवन् व्यक्ितं विदुर्देवा न दानवाः।।10.14।।
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః
।।10.14।।
हे केशव ! जो कुछ भी आप मेरे प्रति कहते हैं, इस सबको मैं सत्य मानता हूँ। हे भगवन्, आपके (वास्तविक) स्वरूप को न देवता जानते हैं और न दानव।।ఓ కేశవా! నీవు నాతో చెప్పిన ప్రతి మాటను నేను సత్యమని నమ్ముతున్నాను. భగవంతుడైన నీ స్వరూపాన్ని దేవతలు గానీ, దానవులు గానీ పూర్తిగా గ్రహించలేరు.

sarvam etad ṛitaṁ manye yan māṁ vadasi keśhava
na hi te bhagavan vyaktiṁ vidur devā na dānavāḥ।।10.14।।

O Keshava! I believe everything You have told me to be completely true. O Lord, neither the gods nor the demons truly understand Your divine nature.
स्वयमेवात्मनाऽत्मानं वेत्थ त्वं पुरुषोत्तम।
भूतभावन भूतेश देवदेव जगत्पते।।10.15।।
స్వయమేవాత్మనా௨త్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే।।10.15।।
हे पुरुषोत्तम ! हे भूतभावन ! हे भूतेश ! हे देवों के देव ! हे जगत् के स्वामी ! आप स्वयं ही अपने आप को जानते हैं।ఓ పురుషోత్తమా! ఓ భూతభావనా! ఓ భూతేశ్వరా! ఓ దేవతల దేవా! ఓ జగత్పతే! నీవు నిన్ను నీవే పూర్తిగా తెలుసుకున్నవాడవు.

swayam evātmanātmānaṁ vettha tvaṁ puruṣhottama
bhūta-bhāvana bhūteśha deva-deva jagat-pate।।10.15।।

O Supreme Person! O Creator of all beings! O Lord of beings! O God of gods! O Master of the universe! You alone truly know Yourself.
वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः।
याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि।।10.16।।
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి।।10.16।।
आप ही उन अपनी दिव्य विभूतियों को अशेषत: कहने के लिए योग्य हैं, जिन विभूतियों के द्वारा इन समस्त लोकों को आप व्याप्त करके स्थित हैंనీ దివ్యమైన విభూతులను పూర్తిగా (అశేషముగా) నాకు నీవే చెప్పగలవు, ప్రభూ! ఎందుకంటే, ఆ మహత్తర విభూతుల ద్వారా నీవు ఈ సమస్త లోకాలను వ్యాపించి నిలిచియున్నావు.

vaktum arhasyaśheṣheṇa divyā hyātma-vibhūtayaḥ
yābhir vibhūtibhir lokān imāṁs tvaṁ vyāpya tiṣhṭhasi।।10.16।।

You are capable of fully describing Your divine glories, O Lord! For through those wondrous manifestations, You pervade and sustain all these worlds.
कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन्।
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया।।10.17।।
కథం విద్యామహం యోగిన్, త్వాం సదా పరిచింతయన్ |
కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా।।10.17।।
हे योगिन् आपका सदा चिन्तन करता हुआ मैं आपको किस प्रकार जानूँ हे भगवन् आप किनकिन भावोंमें अर्थात् वस्तुओंमें मेरे द्वारा चिन्तन किये जानेयोग्य हैं।ఓ యోగీశ్వరా! నిన్ను నిరంతరం స్మరిస్తూ, నిన్ను ఎలా తెలుసుకోవాలి? ఓ ప్రభూ! నిన్ను ఏయే రూపాలలో, భావాలలో ధ్యానించవలసిందో నాకు చెప్పండి.

kathaṁ vidyām ahaṁ yogins tvāṁ sadā parichintayan
keṣhu keṣhu cha bhāveṣhu chintyo ’si bhagavan mayā।।10.17।।

O Lord of Yoga! While constantly meditating on You, how should I come to know You?
O Lord, in which all forms or aspects should I think of You?
विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन।
भूयः कथय तृप्तिर्हि श्रृण्वतो नास्ति मेऽमृतम्।।10.18।।
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన |
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే௨మృతమ్।।10.18।।
हे जनार्दन ! आप अपने योग (सामर्थ्य) को और विभूतियोंको विस्तारसे फिर कहिये; क्योंकि आपके अमृतमय वचन सुनते-सुनते मेरी तृप्ति नहीं हो रही है।ఓ జనార్దనా! నీ యోగమహిమను, విభూతులను మరొకసారి విస్తృతంగా వివరించండి, నీవు చెప్పే అమృత వాక్యాలను వినేకొద్దీ తనివి తీరడం లేదు.

vistareṇātmano yogaṁ vibhūtiṁ cha janārdana
bhūyaḥ kathaya tṛiptir hi śhṛiṇvato nāsti me ’mṛitam।।10.18।।

O Janardana! Please describe again in detail Your divine powers and glories.
For I never tire of hearing Your nectar-like words — they only increase my desire to listen more.
श्री भगवानुवाच
हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः।
प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे।।10.19।।
శ్రీ భగవానువాచ:
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే।।10.19।।
श्रीभगवान् ने कहा -हन्त अब मैं तुम्हें अपनी दिव्य विभूतियों को प्रधानता से कहूँगा। हे कुरुश्रेष्ठ मेरे विस्तार का अन्त नहीं है।ఓ కురుశ్రేష్ఠ అర్జునా! ఇప్పుడు నేను నీకు నా దివ్య విభూతులలో ముఖ్యమైన వాటిని చెబుతాను.
ఎందుకంటే నా విభూతుల వైశాల్యానికి అంతముండదు.

śhrī bhagavān uvācha
hanta te kathayiṣhyāmi divyā hyātma-vibhūtayaḥ
prādhānyataḥ kuru-śhreṣhṭha nāstyanto vistarasya me।।10.19।।

O best of the Kurus, now I shall declare to you My divine glories — but only the most prominent ones.
There is no end to the vastness of My manifestations.
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः।
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च।।10.20।।
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ।।10.20।।
हे गुडाकेश (नींद पर विजय पाने वाले अर्जुन)! मैं सभी प्राणियों के हृदय में स्थित आत्मा हूँ। मैं ही समस्त प्राणियों का आदि, मध्य और अंत हूँఓ గుడాకేశా! (నిద్రపై విజయం సాధించిన అర్జునా!)
నేనే అన్ని ప్రాణుల హృదయాల్లో ఉండే ఆత్మను.
జీవులందరికీ నేనే ఆది, మధ్యం, మరియు అంతము.

aham ātmā guḍākeśha sarva-bhūtāśhaya-sthitaḥ
aham ādiśh cha madhyaṁ cha bhūtānām anta eva cha।।10.20।।

O Gudakesha (Conqueror of sleep, Arjuna)! I am the Self seated in the hearts of all beings.
I am the beginning, the middle, and also the end of all living beings.
आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान्।
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी।।10.21।।
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ।।10.21।।
मैं (बारह) आदित्यों में विष्णु और ज्योतियों में अंशुमान् सूर्य हूँ; मैं (उनचास) मरुतों (वायु देवताओं) में मरीचि हूँ और नक्षत्रों में शशी (चन्द्रमा) हूँ.నేను ఆదిత్యులలో విష్ణువును, ప్రకాశాన్ని ప్రసరించేవాటిలో నేను కిరణాలతో నిండిన సూర్యుణ్ణి, మరుత్తులనే దేవతలలో మరీచి అనే వాయువును, నక్షత్రాలలో చంద్రుణ్ణి.

ādityānām ahaṁ viṣhṇur jyotiṣhāṁ ravir anśhumān
marīchir marutām asmi nakṣhatrāṇām ahaṁ śhaśhī
।।10.21।।

Among the Adityas, I am Vishnu; Among luminous bodies, I am the radiant Sun; Among the Maruts (wind gods), I am Marichi; And among stars, I am the Moon.
वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना।।10.22।।
వేదానాం సామవేదో௨స్మి దేవానామస్మి వాసవః |
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా।।10.22।।
मैं वेदोंमें सामवेद हूँ, देवताओंमें इन्द्र हूँ, इन्द्रियोंमें मन हूँ और प्राणियोंकी चेतना हूँ।వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుణ్ణి, ఇంద్రియాలలో మనస్సును, భూతాలలో చైతన్యాన్ని నేనే.

vedānāṁ sāma-vedo ’smi devānām asmi vāsavaḥ
indriyāṇāṁ manaśh chāsmi bhūtānām asmi chetanā
।।10.22।।

Among the Vedas, I am the Sama Veda; among the gods, I am Indra.
Among the senses, I am the mind; and in all living beings, I am their consciousness.
रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम्।
वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम्।।10.23।।
రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్।।10.23।।
रुद्रोंमें शंकर और यक्ष-राक्षसोंमें कुबेर मैं हूँ।वसुओंमें पावक (अग्नि) और शिखरवाले पर्वतोंमें सुमेरु मैं हूँ।ఏకాదశ రుద్రులలో నేను శంకరుడిని, యక్షులు మరియు రాక్షసులలో నేను కుబేరుడిని, వసువుల్లో నేను అగ్నిని,
పర్వతాల్లో సుమేరు పర్వతమై నేనే ఉన్నాను.

rudrāṇāṁ śhaṅkaraśh chāsmi vitteśho yakṣha-rakṣhasām
vasūnāṁ pāvakaśh chāsmi meruḥ śhikhariṇām aham।।10.23।।

Among the Rudras, I am Shankara (Lord Shiva); Among the Yakshas and Rakshasas, I am Kubera (the god of wealth);
Among the Vasus, I am Pavaka (the fire-god); And among the lofty mountains, I am Mount Meru.
पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम्।
सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः।।10.24।।
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః।।10.24।।
हे पार्थ ! पुरोहितोंमें मुख्य बृहस्पतिको मेरा स्वरूप समझो। सेनापतियोंमें स्कन्द और जलाशयोंमें समुद्र मैं हूँపార్థా ! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనని తెలుసుకో. సేనాధిపతులలో కుమారస్వామిని నేను. సరస్సులలో సముద్రుణ్ణి నేనే.

purodhasāṁ cha mukhyaṁ māṁ viddhi pārtha bṛihaspatim
senānīnām ahaṁ skandaḥ sarasām asmi sāgaraḥ।।10.24।।

O Partha! Among priests, know Me as Brihaspati, the chief of priests. Among military commanders, I am Skanda (Kartikeya). And among bodies of water, I am the ocean.
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम्।
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः।।10.25।।
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |
యజ్ఞానాం జపయజ్ఞో௨స్మి స్థావరాణాం హిమాలయః।।10.25।।
मैं महर्षियों में भृगु और वाणी (शब्दों) में एकाक्षर ओंकार हूँ। मैं यज्ञों में जपयज्ञ और स्थावरों (अचलों) में हिमालय हूँ।మహర్షులలో నేను భృగువును; శబ్దాలలో నేను ఓంకారాన్ని; యజ్ఞాలలో నేను జపయజ్ఞాన్ని; స్థిరమైన వాటిలో నేను హిమాలయ పర్వతాన్ని.

maharṣhīṇāṁ bhṛigur ahaṁ girām asmyekam akṣharam
yajñānāṁ japa-yajño ’smi sthāvarāṇāṁ himālayaḥ।।10.25।।

Among the great sages, I am Bhrigu. Among sounds, I am the single syllable “Om.” Among sacrifices, I am the Japa-yajna, and among stationary things, I am the Himalayas.
अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः।
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः।।10.26।।
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః |
గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః।।10.26।।
समस्त वृक्षोंमें पीपलका वृक्ष और देवर्षियोंमें अर्थात् जो देव होकर मन्त्रोंके द्रष्टा होनेके कारण ऋषिभावको प्राप्त हुए हैं, उनमें मैं नारद हूँ। गन्धर्वोंमें मैं चित्ररथ नामक गन्धर्व हूँ, सिद्धोंमें अर्थात् जन्मसे ही अतिशय धर्म? ज्ञान, वैराग्य और ऐश्वर्यको प्राप्त हुए पुरुषोंमें मैं कपिलमुनि हूँఅన్ని వృక్షాలలో అశ్వత్థవృక్షాన్ని, దేవర్షులలో నారదుణ్ణి, గంధర్వులలో చిత్రరథుణ్ణి, సిద్ధులలో కపిలమునిని నేనే.

aśhvatthaḥ sarva-vṛikṣhāṇāṁ devarṣhīṇāṁ cha nāradaḥ
gandharvāṇāṁ chitrarathaḥ siddhānāṁ kapilo muniḥ।।10.26।।

I am the Ashvattha (Peepal) tree among all trees, Narada among the divine sages, Chitraratha among the Gandharvas, and Kapila Muni among the (Siddhas) perfected beings.
उच्चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम्।
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम्।।10.27।।
ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్।।10.27।।
घोड़ोंमें अमृतके साथ समुद्रसे प्रकट होनेवाले उच्चैःश्रवा नामक घोड़ेको, श्रेष्ठ हाथियोंमें ऐरावत नामक हाथीको और मनुष्योंमें राजाको मेरी विभूति मानो।గుర్రాలలో అమృతంతో సముద్ర మథనంలో పుట్టిన ఉచ్చైఃశ్రవ అనే గుర్రాన్ని, ఏనుగులలో శ్రేష్ఠమైన ఐరావతాన్ని, మనుషులలో రాజుననీ నన్ను తెలుసుకో.

uchchaiḥśhravasam aśhvānāṁ viddhi mām amṛitodbhavam
airāvataṁ gajendrāṇāṁ narāṇāṁ cha narādhipam।।10.27।।

Among horses, I am Uchchaihshravas, born from the ocean along with the nectar. Among elephants, I am Airavata, the supreme one, and among men, I am the king — consider these as My divine manifestations.
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक्।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः।।10.28।।
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః।।10.28।।
आयुधोंमें वज्र और धेनुओंमें कामधेनु मैं हूँ। सन्तान-उत्पत्तिका हेतु कामदेव मैं हूँ और सर्पोंमें वासुकि मैं हूँ।ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని, ఆవులలో కామధేనువును, ప్రజననానికి (సంతానానికి) కారణమయ్యే మన్మథుడిని, పాములలో వాసుకిని.

āyudhānām ahaṁ vajraṁ dhenūnām asmi kāmadhuk
prajanaśh chāsmi kandarpaḥ sarpāṇām asmi vāsukiḥ।।10.28।।

Among weapons, I am the thunderbolt (Vajra). Among cows, I am Kamadhenu, the wish-fulfilling one. I am Kamadeva (the god of love) among causes of procreation, and among serpents, I am Vasuki.
अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम्।
पितृ़णामर्यमा चास्मि यमः संयमतामहम्।।10.29।।
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్।।10.29।।
नागोंमें अनन्त (शेषनाग) और जल-जन्तुओंका अधिपति वरुण मैं हूँ। पितरोंमें अर्यमा और शासन करनेवालोंमें यमराज मैं हूँ।నాగులలో ఆదిశేషుణ్ణి, జలదేవతలలో వరుణుణ్ణి. పితృదేవతలలో ఆర్యముణ్ణి, శాసించేవాళ్ళలో యముణ్ణి నేనే.

anantaśh chāsmi nāgānāṁ varuṇo yādasām aham
pitṝīṇām aryamā chāsmi yamaḥ sanyamatām aham।।10.29।।

Among the Nagas (serpent beings), I am Ananta; among aquatic beings, I am Varuna. Among the ancestors (Pitrs), I am Aryama; and among the controllers or disciplinarians, I am Yama, the god of death.
प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम्।
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम्।।10.30।।
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ |
మృగాణాం చ మృగేంద్రో௨హం వైనతేయశ్చ పక్షిణామ్।।10.30।।
दैत्योंमें प्रह्लाद और गणना करनेवालोंमें काल मैं हूँ । पशुओंमें सिंह और पक्षियोंमें गरुड मैं हूँ।నేను దైత్యులలో ప్రహ్లాదుణ్ణి, లెక్కించేవాళ్ళలో కాలాన్ని, మృగాలలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుణ్ణి నేనే

prahlādaśh chāsmi daityānāṁ kālaḥ kalayatām aham
mṛigāṇāṁ cha mṛigendro ’haṁ vainateyaśh cha pakṣhiṇām।।10.30।।

Among the Daityas (demons), I am Prahlada. Among those who measure time, I am Time itself. Among beasts, I am the lion. And among birds, I am Garuda, the son of Vinata.
पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम्।
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी।।10.31।।
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ |
ఝుషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ।।10.31।।
पवित्र करनेवालोंमें वायु और शस्त्रधारियोंमें दशरथपुत्र राम मैं हूँ, मछली आदि जलचर प्राणियोंमें मकर नामक जलचरोंकी जातिविशेष मैं हूँ, स्रोतोंमें — नदियोंमें मैं जाह्नवी — (गङ्गा ) हूँ।పవిత్రం చేసేవాటిలో గాలిని నేను, ఆయుధధారులలో రాముణ్ణి నేను, జలచరాలలో మొసలిని, నదులలో గంగా (జాహ్నవీ) నదిని నేను.

pavanaḥ pavatām asmi rāmaḥ śhastra-bhṛitām aham
jhaṣhāṇāṁ makaraśh chāsmi srotasām asmi jāhnavī।।10.31।।

Among purifiers, I am the wind; among warriors bearing weapons, I am Rama; among aquatic creatures (fishes), I am the makara (crocodile); and among rivers, I am the Jahnavi — the Ganga.
सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन।
अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम्।।10.32।।
సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున |
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్।।10.32।।
हे अर्जुन ! सम्पूर्ण सर्गोंके आदि, मध्य तथा अन्तमें मैं ही हूँ। विद्याओंमें अध्यात्मविद्या और परस्पर शास्त्रार्थ करनेवालोंका(तत्त्व-निर्णयके लिये किया जानेवाला) वाद मैं हूँ।

(यहाँ प्रवदताम् इस पदसे वक्ताद्वारा बोले जानेवाले वाद, जल्प और वितण्डा — इन तीन प्रकारके वचनभेदोंका ही ग्रहण है ( बोलनेवालोंका नहीं ))
అర్జునా ! సమస్త సృష్టికి నేనే ఆది, అంతము మరియు మధ్యం, విద్యలలో ‘అధ్యాత్మవిద్య’ — ఆత్మజ్ఞానము నేనే, మరియు తర్కపూర్వకంగా తత్వనిర్ణయానికై జరిగే శాస్త్రార్థాలలో వాదించేవాళ్ళలోని వాదాన్ని నేను.

sargāṇām ādir antaśh cha madhyaṁ chaivāham arjuna
adhyātma-vidyā vidyānāṁ vādaḥ pravadatām aham।।10.32।।

O Arjuna, among creations I am the beginning, the middle, and the end.
Among all branches of knowledge, I am the knowledge of the Self (spiritual wisdom),
and among debaters, I am logical and truthful argument.
अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च।
अहमेवाक्षयः कालो धाताऽहं विश्वतोमुखः।।10.33।।
అక్షరాణామకారో௨స్మి ద్వంద్వః సామాసికస్య చ |
అహమేవాక్షయః కాలో ధాతా௨హం విశ్వతోముఖః।।10.33।।
 मैं अक्षरों (वर्णमाला) में अकार और समासों में द्वन्द्व (नामक समास) हूँ; मैं अक्षय काल और विश्वतोमुख (विराट् स्वरूप) धाता हूँ।।అక్షరాలలో ‘అ’ కారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, నాశనం లేని కాలాన్ని, అన్ని దిక్కులకూ ముఖాలు కలిగిన ( అన్నిదిక్కులనుంచి చూచే జగత్ప్రభువు ) బ్రహ్మనూ నేనే

akṣharāṇām a-kāro ’smi dvandvaḥ sāmāsikasya cha
aham evākṣhayaḥ kālo dhātāhaṁ viśhvato-mukhaḥ।।10.33।।

Among all letters, I am the first — the letter ‘A’; Among compound words, I am the Dvandva (co-ordinate compound).
I am the imperishable Time itself, and I am the all-facing Creator( Bramha), the cosmic sustainer of the universe.
मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम्।
कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा।।10.34।।
మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా।।10.34।।
मैं सर्वभक्षक मृत्यु और भविष्य में होने वालों की उत्पत्ति का कारण हूँ; स्त्रियों में कीर्ति, श्री, वाक (वाणी), स्मृति, मेधा, धृति और क्षमा हूँ।నేను సమస్తాన్ని హరించే మృత్యువుని, మరియు భవిష్యత్తులో కలిగే వాటికి ఉద్భవ కారణముని.
స్త్రీలలో నేను కీర్తి, శ్రీ (సంపద), వాక్కు (మాట), స్మృతి (జ్ఞాపకశక్తి), మేధ (బుద్ధి), ధృతి (స్థిరత), మరియు క్షమ (శాంతత)నూ నేనే

mṛityuḥ sarva-haraśh chāham udbhavaśh cha bhaviṣhyatām
kīrtiḥ śhrīr vāk cha nārīṇāṁ smṛitir medhā dhṛitiḥ kṣhamā
।।10.34।।

I am Death, the destroyer of all things, and I am the origin of all that is yet to be. Among women, I represent Fame, Prosperity, Speech, Memory, Intelligence, Steadfastness, and Forgiveness.
बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम्।
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः।।10.35।।
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |
మాసానాం మార్గశీర్షో௨హమృతూనాం కుసుమాకరః
।।10.35।।
गायी जानेवाली श्रुतियोंमें बृहत्साम और वैदिक छन्दोंमें गायत्री छन्द मैं हूँ। बारह महीनोंमें मार्गशीर्ष और छः ऋतुओंमें वसन्त मैं हूँ।సామవేదగానాలలో బృహత్సామాన్ని, ఛందస్సులలో గాయత్రిని నేనే, మాసాలలో మార్గశిరాన్ని, ఋతువులలో వసంతాన్ని నేనే.

bṛihat-sāma tathā sāmnāṁ gāyatrī chhandasām aham
māsānāṁ mārga-śhīrṣho ’ham ṛitūnāṁ kusumākaraḥ।।10.35।।

Among the hymns of the Sāma Veda, I am the Br̥hatsāma; Among poetic meters, I am the Gāyatrī meter. Among months, I am Mārgaśīrṣa (November–December), And among seasons, I am spring — the season of flowers.
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम्।
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम्।।10.36।।
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయో௨స్మి వ్యవసాయో௨స్మి సత్త్వం సత్త్వవతామహమ్
।।10.36।।
मैं छल करने वालों में द्यूत हूँ और तेजस्वियों में तेज हूँ, मैं विजय हूँ; मैं व्यवसाय (उद्यमशीलता) हूँ और सात्विक पुरुषों का सात्विक भाव हूँ। నేను మోసగాళ్ళలో జూదాన్ని, తేజోవంతులలో తేజస్సును, నేను విజయాన్ని, శ్రమించేవారిలో కృషిని, బలవంతులలో బలాన్ని నేనే.

dyūtaṁ chhalayatām asmi tejas tejasvinām aham
jayo ’smi vyavasāyo ’smi sattvaṁ sattvavatām aham।।10.36।।

Among the deceitful, I am gambling (dyūta), Among the radiant, I am brilliance. I am victory, I am enterprise (initiative and business skill), And among virtuous (sāttvic) people, I am their virtuous nature.
वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनंजयः।
मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः।।10.37।।
వృష్ణీనాం వాసుదేవో௨స్మి పాండవానాం ధనంజయః |
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః।।10.37।।
मैं वृष्णियों में वासुदेव हूँ और पाण्डवों में धनंजय, मैं मुनियों में व्यास और कवियों में उशना कवि हूँ।।నేను వృష్ణివంశీయుల్లోవాసుదేవుణ్ణి, పాండవులలో అర్జునుణ్ణి, మునులలో వ్యాసుణ్ణి, కవుల్లో ( త్రికాలజ్ఞులలో) శుక్రాచార్యుణ్ణి.

vṛiṣhṇīnāṁ vāsudevo ’smi pāṇḍavānāṁ dhanañjayaḥ
munīnām apyahaṁ vyāsaḥ kavīnām uśhanā kaviḥ।।10.37।।

Among the Vrishnis, I am Vasudeva (Krishna); Among the Pandavas, I am Dhananjaya (Arjuna); Among sages, I am Vyasa; And among poets, I am Ushana (a renowned poet and seer, also known as Shukracharya)
दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम्।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम्।।10.38।।
దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్।।10.38।।
दमन करनेवालोंमें दण्डनीति और विजय चाहनेवालोंमें नीति मैं हूँ। गोपनीय भावोंमें मौन और ज्ञानवानोंमें ज्ञान मैं हूँదండించేవాళ్ళలో దండనీతిని, జయాభిలాష కలవారిలో నీతిని, రహస్యాలలో మౌనాన్ని; జ్ఞానవంతులలో జ్ఞానాన్ని నేనే.

daṇḍo damayatām asmi nītir asmi jigīṣhatām
maunaṁ chaivāsmi guhyānāṁ jñānaṁ jñānavatām aham।।10.38।।

I am the power of punishment amongst means of preventing lawlessness; proper conduct amongst those who seek victory. I am silence among secrets, and knowledge among the wise.
यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन।
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम्।।10.39।।
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాత్, మయా భూతం చరాచరమ్।।10.39।।
हे अर्जुन सर्वभूतोंका जो बीज अर्थात् उत्पत्तिका कारण है, वह मैं हूँ। प्रकरणका उपसंहार करनेके लिये समस्त विभूतियोंका सार कहते हैं — ऐसा वह चर या अचर कोई भी भूत प्राणी नहीं है जो मेरे बिना हो। क्योंकि जो मुझसे रहित होगा वह सत्तारहित — शून्य होगा? अतः यह सिद्ध हुआ कि सब कुछ मेरा ही स्वरूप है।అర్జునా! సమస్త భూతప్రాణుల ఉత్పత్తికి కారణమైన విత్తనం నేనే. చివరిగా చెప్పాలంటే — కదిలేది & కదలనిది ఏ జీవి అయినా నాతో సంబంధం లేకుండా ఉండలేదు. ఎందుకంటే నా నుండి వేరుపడినది శూన్యమై, అస్థిత్వం కోల్పోయి ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచం అంతా నా స్వరూపమని తెలుసుకో.

yach chāpi sarva-bhūtānāṁ bījaṁ tad aham arjuna
na tad asti vinā yat syān mayā bhūtaṁ charācharam।।10.39।।

O Arjuna, know that I am the seed, the very origin of all living beings. Every creature that moves and every creature that does not move arises from Me. Nothing in this world exists without My presence at its core. I am the source and sustainer of all forms of life. Without Me, nothing can exist.
नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परंतप।
एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया।।10.40।।
నాంతో௨స్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా।।10.40।।
हे परन्तप मेरी दिव्य विभूतियोंका अर्थात् विस्तारका अन्त नहीं है। क्योंकि सर्वात्मरूप ईश्वरकी दिव्य विभूतियाँ इतनी ही है इस प्रकार किसीके द्वारा भी जाना या कहा नहीं जा सकता। यह तो अपनी विभूतियोंका विस्तार मेरेद्वारा संक्षेपसे अर्थात् एक अंशसे ही कहा गया है.ఓ పరంతపా! నా దివ్యవిభూతులకు అంతం లేదు,
సమస్త ప్రాణుల్లో వ్యాప్తమైయున్న నన్ను పూర్తిగా ఎవరూ వివరిం చలేరు. ఇక్కడ నేను నా విభూతులను కేవలం ఒక చిన్న భాగంగా మాత్రమే సంక్షిప్తంగా వివరించాను.

nānto ’sti mama divyānāṁ vibhūtīnāṁ parantapa
eṣha tūddeśhataḥ prokto vibhūter vistaro mayā।।10.40।।

O Arjuna, the expanse of My divine glories has no end. The divine manifestations of the Supreme Self cannot be fully described or understood by anyone. What I have spoken here is only a brief outline, describing just a small portion of My vast powers. Know this!!..
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा।
तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसंभवम्।।10.41।।
యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।
తత్తదేవావగచ్చ త్వం మమ తేజోఽoశసంభవమ్।।10.41।।
जो कोई भी विभूतियुक्त, कान्तियुक्त अथवा शक्तियुक्त वस्तु (या प्राणी) है, उसको तुम मेरे तेज के अंश से ही उत्पन्न हुई जानोఈ లోకంలో ఐశ్వర్యం, శోభ, శక్తి కలిగిన ప్రతి వస్తువూ నా దివ్య తేజస్సులోని ఒక చిన్న భాగం నుంచే ఉద్భవించినదని గ్రహించు.

yad yad vibhūtimat sattvaṁ śhrīmad ūrjitam eva vā
tat tad evāvagachchha tvaṁ mama tejo ’nśha-sambhavam ।।10.41।।

Whatever being is glorious, prosperous, or powerful — know that it has sprung from just a spark of My divine splendor.
अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन।
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत्।।10.42।।
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్।।10.42।।
अथवा हे अर्जुन ! तुम्हें इस प्रकार बहुत-सी बातें जाननेकी क्या आवश्यकता है?  मैं अपने किसी एक अंशसे  सम्पूर्ण जगत् को व्याप्त करके स्थित हूँ।ఓ అర్జునా! ఈ అనేక విషయాలు తెలుసుకోవడానికి నీకు అవసరం ఏమిటి? నేను నా ఒక భాగంతోనే సమస్త జగత్తు యందు వ్యాపించి స్తితుడనై ఉన్నాను.

atha vā bahunaitena kiṁ jñātena tavārjuna
viṣhṭabhyāham idaṁ kṛitsnam ekānśhena sthito jagat।।10.42।।

O Arjuna, what is the need for you to know all these details?
I, with just a tiny fraction of My divine power, pervade the entire universe and remain within it, sustaining everything.

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विभूति योग: दशमोऽध्यायः॥

ఓం తత్ సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగోనమః దశమోధ్యాయః

“Om Tat Sat. Thus ends the tenth chapter of the Bhagavad Gita, titled ‘The Yoga of Divine Glories,’ a dialogue between Sri Krishna and Arjuna, which is part of the Upanishads, the scripture of Brahmavidya (knowledge of the Absolute) and Yoga Shastra.”