| ॐ श्री परमात्मने नमः अथ अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः॥ | ఓం శ్రీ పరమాత్మనే నమః అథ అష్టమోధ్యాయః అక్షరబ్రహ్మయోగః॥ |
Om Shri Paramatmane Namaha.
This marks the beginning of Chapter 8 – The Path of the Imperishable Absolute (Akshara-Brahma-Yogaḥ).”
| अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम। अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते॥ 8.1॥ | అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ। అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే॥ 8.1॥ |
| अर्जुन बोले — हे पुरुषोत्तम ! वह ब्रह्म क्या है? अध्यात्म क्या है? कर्म क्या है? अधिभूत किसको कहा गया है? और अधिदैव किसको कहा जाता है? | అర్జునుడు పలికెను: పురుషోత్తమా ! బ్రహ్మమంటే ఏమిటి? అధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి? |
arjuna uvācha
Arjuna asked: O Supreme Person! What is Brahman? What is the self (adhyatma)? What is karma? What is called the material manifestation (adhibhuta)? And what is the divine (adhidaiva)?
kiṁ tad brahma kim adhyātmaṁ kiṁ karma puruṣhottama
adhibhūtaṁ cha kiṁ proktam adhidaivaṁ kim uchyate॥ 8.1॥
| अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन। प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः॥ 8.2॥ | అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్మధుసూదన । ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ॥ 8.2॥ |
| यहाँ अधियज्ञ कौन है और वह इस देहमें कैसे है? हे मधूसूदन ! नियतात्मा (वशीभूत अन्तःकरणवाले) मनुष्यके द्वारा अन्तकालमें आप कैसे जाननेमें आते हैं? | ఇక్కడ అధియజ్ఞుడు ఎవరు? ఆయన ఈ శరీరంలో ఎలా ఉన్నాడు? ఓ మధుసూదనా! నియతాత్ముడు (వశీకృత అంతఃకరణం కలిగిన మనిషి) తన చివరి సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు? |
adhiyajñaḥ kathaṁ ko ’tra dehe ’smin madhusūdana
O Madhusudana! Who is the Lord of sacrifice (adhiyajna) in this body, and how does He exist? How can the self-controlled know You at the time of death.
prayāṇa-kāle cha kathaṁ jñeyo ’si niyatātmabhiḥ॥ 8.2॥
| श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते। भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः॥ 8.3॥ | శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే। భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః॥ 8.3॥ |
| श्रीभगवान् ने कहा — परम अक्षर (अविनाशी) तत्त्व ब्रह्म है; स्वभाव (अपना स्वरूप) अध्यात्म कहा जाता है; भूतों के भावों को उत्पन्न करने वाला विसर्ग (यज्ञ, प्रेरक बल) कर्म नाम से जाना जाता है।। | శ్రీ భగవానుడు పలికెను: అక్షరమైన పరమ తత్త్వం “బ్రహ్మం” అని పిలవబడుతుంది. స్వీయ స్వరూపాన్ని “అధ్యాత్మం” అంటారు. భూతముల యొక్క ఉద్భవానికి కారణమయ్యే సృష్టి క్రియ (యజ్ఞము లేదా ప్రేరణాత్మక శక్తి) “కర్మ” అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. |
śhrī-bhagavān uvācha
The Supreme Lord said: The eternal, imperishable Brahman is the highest reality. The individual self (svabhava) is called adhyatma, and the force that causes the creation of all beings is known as karma.
akṣharaṁ brahma paramaṁ svabhāvo ’dhyātmam uchyate
bhūta-bhāvodbhava-karo visargaḥ karma-saṁjñitaḥ॥ 8.3॥
| अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम्। अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर॥ 8.4॥ | అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్। అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర॥ 8.4॥ |
| हे देहधारियोंमें श्रेष्ठ अर्जुन ! क्षरभाव अर्थात् नाशवान् पदार्थको (पंचमहाभूत) अधिभूत कहते हैं, पुरुष अर्थात् हिरण्यगर्भ ब्रह्माजी अधिदैव हैं और इस देहमें अन्तर्यामीरूपसे मैं ही अधियज्ञ हूँ। | శరీరధారులలో శ్రేష్ఠుడైన అర్జునా! నశ్వరమైన పదార్థాలను (పంచభూతాలను) అధిభూతం అంటారు. పురుషుడు అంటే అధిదైవం. ఈ దేహంలో అంతర్యామిగా ఉన్న నేను అధియజ్ఞుడను. |
adhibhūtaṁ kṣharo bhāvaḥ puruṣhaśh chādhidaivatam
The perishable nature of the material world is called adhibhuta. The Supreme Being (Purusha) is called adhidaiva. And, O Arjuna, I Myself am the Lord of all sacrifices (adhiyajna) within the body.
adhiyajño ’ham eva ’tra dehe deha-bhṛitāṁ vara॥ 8.4॥
| अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम्। यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः॥ 8.5॥ | అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం। యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః॥ 8.5॥ |
| जो अन्तकाल में केवल मेरा स्मरण करता हुआ शरीर को त्यागकर जाता है, वह मेरे स्वरूप को प्राप्त होता है, इसमें कोई संदेह नहीं है. | ఏవడు తన అంతిమ సమయంలో (పునర్జన్మ రహితమైన పరమ గమ్యంలో) నన్నే స్మరించుకుంటూ తన శరీరాన్ని విడిచిపెడతాడో, అతడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో ఎటువంటి సంశయం లేదు. |
anta-kāle cha mām eva smaran muktvā kalevaram
One who, at the time of final departure (anta-kala, meaning never to return to birth and death), remembers Me alone and leaves the body, surely attains My divine nature. Of this, there is no doubt.
yaḥ prayāti sa mad-bhāvaṁ yāti nāsty atra sanśhayaḥ॥ 8.5॥
| यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम्। तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः॥ 8.6॥ | యం యం వాపి స్మరన్భావం త్యజత్యంతే కళేవరం। తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః॥ 8.6॥ |
| हे कुन्तीपुत्र अर्जुन ! मनुष्य अन्तकाल में जिस-जिस भी भावका स्मरण करते हुए शरीर छोड़ता है वह उस (अन्तकालके) भावसे सदा भावित होता हुआ उस-उसको ही प्राप्त होता है अर्थात् उस-उस योनिमें ही चला जाता है. | కుంతీపుత్ర అర్జునా! మనిషి తన చివరి క్షణంలో ఏ భావాన్ని తలచుకుంటూ తన శరీరాన్ని విడిచిపెడుతాడో, ఆ వ్యక్తి అదే స్థితిని పొందును. (అదే యోనిని (జన్మను) పొందుతాడు.) |
yaṁ yaṁ vāpi smaran bhāvaṁ tyajaty ante kalevaram
O Kaunteya (Arjuna), whatever state of being one remembers at the time of leaving the body, that alone one attains, as one is always absorbed in that thought.
taṁ tam evaiti kaunteya sadā tad-bhāva-bhāvitaḥ॥ 8.6॥
| तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च। मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयः॥ 8.7॥ | తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ। మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయః॥ 8.7॥ |
| इसलिए, हे अर्जुन! तू सब कालों में मेरा ही स्मरण कर और युद्ध कर। इस प्रकार मन और बुद्धि को मुझमें अर्पण करके तू निःसंदेह मुझको ही प्राप्त होगा. | అందువలన, హే అర్జునా! అన్ని సమయాల్లో నన్నే తలచుకుంటూ యుద్ధం చేయు. నీ మనస్సు, బుద్ధిని నాకే అర్పించు, నీవు నిస్సందేహంగా నన్నే పొందుతావు. |
tasmāt sarveṣu kāleṣu mām anusmara yudhya cha
Therefore, O Arjuna, always remember Me and fight. With your mind and intellect surrendered to Me, you will surely attain Me—there is no doubt about it.
mayy arpitamano-buddhir mām evaiṣhyasy asaṁśhayaḥ॥ 8.7॥
| अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना | परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन्॥ 8.8॥ | అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా | పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్॥ 8.8॥ |
| हे पार्थ ! अभ्यासयोग से युक्त अन्यत्र न जाने वाले चित्त से निरन्तर चिन्तन करता हुआ (साधक) परम दिव्य पुरुष को प्राप्त होता है. | ఓ పార్థా ! మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమపురుషుడైన భగవానుణ్ణి నిరంతరం ధ్యానించేవాడు ఆయననే పొందగలుగుతాడు. |
abhyāsa-yoga-yuktena chetasā nānyagāminā
The person who practices the yoga of constant meditation and does not let his mind wander elsewhere, but keeps meditating on the Supreme Divine Person, attains that supreme divine being.
paramam puruṣham divyam yāti pārthānucintayan॥ 8.8॥
| कविं पुराणमनुशासितार मणोरणीयांसमनुस्मरेद्यः। सर्वस्य धातारमचिन्त्यरूप मादित्यवर्णं तमसः परस्तात्।।8.9।। | కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాంసమనుస్మరేద్యః । సర్వస్య ధాతారమచింత్యరూపమ్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ॥ 8.9॥ |
| जो पुरुष सर्वज्ञ, प्राचीन (पुराण), सबके नियन्ता, सूक्ष्म से भी सूक्ष्मतर, सब के धाता, अचिन्त्यरूप, सूर्य के समान प्रकाश रूप और (अविद्या) अन्धकार से परे तत्त्व का अनुस्मरण करता है. | భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు. |
kaviṁ purāṇam anuśhāsitāram
God is Omniscient, the most ancient One, the Controller, subtler than the subtlest, the Support of all, and the possessor of an inconceivable divine form; He is brighter than the sun, and beyond all darkness of ignorance.
aṇor aṇīyānsam anusmared yaḥ
sarvasya dhātāram achintya-rūpam
āditya-varṇaṁ tamasaḥ parastāt ।।8.9।।
| प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव | भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् स तं परं पुरुषमुपैति दिव्यम् ॥ 8.10॥ | ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ। భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యం॥ 8.10॥ |
| वह (साधक) अन्तकाल में योगबल से प्राण को भ्रकुटि के मध्य सम्यक् प्रकार स्थापन करके निश्चल मन से भक्ति युक्त होकर उस परम दिव्य पुरुष को प्राप्त होता है।। | చివరి క్షణంలో, స్థిరమైన మనస్సుతో, భక్తితో, యోగబలంతో ప్రాణాన్ని కనుబొమల మధ్యలో కేంద్రీకరించినవాడు దివ్యమైన పురుషుణ్ణి పొందుతాడు. |
prayāṇa-kāle manasā’calena bhaktyā yukto yoga-balena caiva।
A person who, at the time of death, keeps the mind steady, filled with devotion and yogic strength, and places the life-force between the eyebrows — reaches the divine Supreme Being.
bhruvor-madhye prāṇam āveśya samyak sa taṁ paraṁ puruṣam upaiti divyam॥ 8.10॥
| यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः। यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये॥ 8.11॥ | యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః। యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే॥ 8.11॥ |
| वेदवेत्ता लोग जिसको अक्षर कहते हैं, वीतराग यति जिसको प्राप्त करते हैं और साधक जिसकी प्राप्तिकी इच्छा करते हुए ब्रह्मचर्यका पालन करते हैं, वह पद मैं तेरे लिये संक्षेपसे कहूँगा. | వేదాలను తెలిసిన ఋషులు “అక్షరమయిన తత్త్వం”గా ఎరిగినదాన్ని, వీతరాగులు (రాగ-ద్వేషాలను జయించిన యతులు) సాధించినదాన్ని, మరియు సాధకులు అందుకోవాలనే ఆశతో బ్రహ్మచర్యాన్ని ఆచరించేటటువంటి ఆ పరమ పదాన్ని – ఇప్పుడు నీకు సంక్షేపంగా చెప్పుదును. |
yad akṣaraṁ veda-vido vadanti
That imperishable state which the knowers of the Vedas speak of, into which the passion-free sages enter, and for which people practice celibacy—That Supreme Goal I shall briefly explain to you.
viśanti yad yatayo vīta-rāgāḥ।
yad icchanto brahmacaryaṁ caranti
tat te padaṁ saṅgraheṇa pravakṣye॥ 8.11॥
| सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुद्ध्य च। मूर्ध्न्याधायात्मनः प्राणम् आस्थितो योगधारणाम्॥ 8.12॥ | సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ | మూర్ధ్న్యా ధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ ॥ 8.12॥ |
| सब (इन्द्रियों के) द्वारों को संयमित कर मन को हृदय में स्थिर करके और प्राण को मस्तक में स्थापित करके योगधारणा में स्थित हुआ… | సమస్త ఇంద్రియద్వారాలను నియంత్రించి, మనస్సును హృదయంలో స్థిరపరిచి, ప్రాణశక్తిని తలలో స్థాపించి, యోగధారణలో స్థితిచెందినవాడు…. |
sarva-dvārāṇi saṁyamya manaḥ hṛdi nirudhya ca।
Controlling all the senses, focusing the mind in the heart, and placing the life-breath in the head—one remains firmly situated in yogic meditation….
mūrdhny-ādhāyātmanaḥ prāṇam āsthito yoga-dhāraṇām॥ 8.12॥
| ओम् इत्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन्। यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम्॥ 8.13॥ | ఓమ్ ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరణ్మామనుస్మరణ్। యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం॥ 8.13॥ |
| “ॐ” इस एकाक्षर ब्रह्म का उच्चारण करता हुआ और मुझे स्मरण करता हुआ जो व्यक्ति शरीर का त्याग करता है, वह परम गति को प्राप्त होता है। | “ఓమ్” అనే ఏకాక్షర బ్రహ్మను జపిస్తూ, నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదిలే వాడు పరమ గమ్యాన్ని పొందుతాడు। |
om ity ekākṣaraṁ brahma vyāharan mām anusmaran।
He who chants the single-syllabled “Om” and remembers Me while leaving the body attains the supreme destination.
yaḥ prayāti tyajan dehaṁ sa yāti paramāṁ gatim॥ 8.13॥
| अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः। तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः॥ 8.14॥ | అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః। తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః॥ 8.14॥ |
| जो मनुष्य सदा अनन्य भाव से मेरा स्मरण करता है, उस नित्ययुक्त योगी के लिए मैं सहज ही प्राप्त होता हूँ। | ఎవడు ఎల్లప్పుడూ ఏకాగ్రతతో నన్ను స్మరిస్తాడో, ఆ నిత్యయోగికి నేను సులభంగా లభిస్తాను. |
ananya-cetāḥ satataṁ yo māṁ smarati nityaśaḥ।
The one who always thinks of Me with an undivided mind — for such ever-devoted yogi, O Arjuna, I am easily attainable.
tasyāhaṁ sulabhaḥ pārtha nitya-yuktasya yoginaḥ॥ 8.14॥
| मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम्। नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः॥ 8.15॥ | మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్। నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః॥ 8.15॥ |
| जो महात्मा मेरी प्राप्ति करके परम सिद्धि को प्राप्त हो जाते हैं, वे फिर से इस दुःखमय और नश्वर जन्म को नहीं पाते। | నా సాన్నిధ్యం పొందిన మహాత్ములు పరమ సిద్ధిని పొందినవారు ఈ దుఃఖమయమైన, నశ్వరమైన జన్మను తిరిగి పొందరు. |
mām upetya punar janma duḥkhālayam aśāśvatam।
Great souls who attain Me do not take birth again in this temporary and sorrowful world, for they have reached the highest perfection.
nāpnuvanti mahātmānaḥ saṁsiddhiṁ paramāṁ gatāḥ॥ 8.15॥
| आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन। मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते॥ 8.16॥ | ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోఽర్జున। మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే॥ 8.16॥ |
| हे अर्जुन! ब्रह्मलोक तक के सब लोक पुनर्जन्म को प्राप्त होते हैं, परंतु मेरी प्राप्ति के बाद जन्म फिर नहीं होता। | అర్జునా! బ్రహ్మలోకంవరకూ వుండే సకలలోకాలూ పునర్జన్మను కలగజేసేవే. నన్ను పొందినవాళ్ళకు మాత్రం పునర్జన్మ ఉండదు. |
ābrahma-bhuvanāl lokāḥ punar āvartino ’rjuna।
O Arjuna! All worlds, including Brahma’s, are subject to rebirth. But one who reaches Me never takes birth again.
mām upetya tu kaunteya punar janma na vidyate॥ 8.16॥
| सहस्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदुः। रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः॥ 8.17॥ | సహస్రయుగపర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః। రాత్రిం యుగసహస్రాంతాం తేఽహోరాత్రవిదో జనాః॥ 8.17॥ |
| जो लोग ब्रह्मा का एक दिन सहस्र युगों के बराबर और रात भी उतनी ही बताते हैं — वे ही वास्तव में दिन-रात का ज्ञान रखते हैं। | బ్రహ్మదేవుని ఒక రోజు చతుర్యుగాల సహస్రానికి సమానమని, ఆయన రాత్రి కూడా అంతే కాలమని తెలుసుకున్నవారు నిజంగా రాత్రి, పగలుని అర్థం చేసుకున్నవారు. |
sahasra-yuga-paryantam ahar yad brahmaṇo viduḥ।
Those who understand that one day of Brahma lasts for a thousand yugas and so does his night — they truly know the nature of day and night.
rātriṁ yuga-sahasrāntāṁ te ’ho-rātra-vido janāḥ॥ 8.17॥
| अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे। रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके॥ 8.18॥ | అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే। రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే॥ 8.18॥ |
| दिन के आरम्भ में सभी प्राणी अव्यक्त से प्रकट होते हैं, और रात के आगमन पर वे सभी उसी अव्यक्त में लीन हो जाते हैं। | బ్రహ్మ యొక్క ప్రభోధకాలంలో అన్ని జీవులు అవ్యక్తం నుండి ఉత్పన్నమవుతాయి; రాత్రి వచ్చినపుడు అవన్నీ మళ్ళీ అదే అవ్యక్తములో లీనమవుతాయి. |
avyaktād vyaktayaḥ sarvāḥ prabhavanty ahar-āgame।
At the beginning of the day, all beings emerge from the unmanifest; at the arrival of night, they dissolve back into that same unmanifest.
rātry-āgame pralīyante tatraivāvyakta-saṁjñake॥ 8.18॥
| भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते। रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे॥ 8.19॥ | భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే। రాత్ర్యాగమేऽవశః పార్థ ప్రభవత్యహరాగమే॥ 8.19॥ |
| हे पार्थ! वही भूतग्राम (जीवसमूह) बार-बार उत्पन्न होकर, रात के समय लीन हो जाता है और दिन के आरम्भ में प्रकट हो जाता है। | పార్థా! ఇదే జీవ సమూహం పునఃపునః పుట్టి, రాత్రి వచ్చినప్పుడు లీనమై, ప్రభోధకాలంలో మళ్ళీ పుడుతుంది. |
bhūta-grāmaḥ sa evāyaṁ bhūtvā bhūtvā pralīyate।
O Partha! This same multitude of beings, being born again and again, dissolves at night and helplessly manifests again at the coming of day.
rātry-āgame ’vaśaḥ pārtha prabhavaty ahar-āgame॥ 8.19॥
| परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातनः। यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति॥ 8.20॥ | పరస్తస్మాత్తు భావో௨న్యో௨వ్యక్తో௨వ్యక్తాత్ సనాతనః | యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి॥ 8.20॥ |
| उस अव्यक्त से भी परे एक सनातन अव्यक्त तत्त्व है, जो सभी प्राणियों के नाश के समय भी नष्ट नहीं होता। | ఆ అవ్యక్తం కన్నా మరొక శాశ్వతమైన అవ్యక్త తత్వం ఉంది, అది అన్ని జీవులు నశించినపుడు కూడా నశించదు. |
paras tasmāt tu bhāvo ’nyo ’vyakto ’vyaktāt sanātanaḥ।
Beyond that unmanifest is another eternal unmanifest being, which does not perish even when all beings perish.
yaḥ sa sarveṣu bhūteṣu naśyatsu na vinaśyati॥ 8.20॥
| अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम्। यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम॥ 8.21॥ | అవ్యక్తో௨క్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిమ్ | యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ॥ 8.21॥ |
| उसीको अव्यक्त और अक्षर कहा गया है और उसीको परमगति कहा गया है तथा जिसको प्राप्त होनेपर जीव फिर लौटकर नहीं आते, वह मेरा परमधाम है। | దానినే అవ్యక్తం మరియు అక్షరం అని చెప్పబడింది. అదే పరమగతిగా కూడా పరిగణించబడుతుంది. ఆ స్థితిని పొందిన తరువాత జీవులు తిరిగి ఈ లోకానికి రారు — అదే నా పరమధామం. |
avyakto ’kṣara ity uktas tam āhuḥ paramāṁ gatim।
That which is called the unmanifest and imperishable is the supreme goal. Those who attain it never return — that is My supreme abode.
yaṁ prāpya na nivartante tad dhāma paramaṁ mama॥ 8.21॥
| पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया। यस्यान्तःस्थानि भूतानि येन सर्वमिदं ततम्॥ 8.22॥ | పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా। యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్॥ 8.22॥ |
| हे पार्थ ! जिस (परमात्मा) के अन्तर्गत समस्त भूत हैं और जिससे यह सम्पूर्ण (जगत्) व्याप्त है, वह परम पुरुष अनन्य भक्ति से ही प्राप्त करने योग्य है. | పార్థ! సమస్త భూతాలు యే పరమాత్మునిలో స్థితమై ఉన్నాయో, మరియు ఆ పరమాత్ముడు ఏ సమస్త జగత్తుని వ్యాపించి ఉన్నాడో — అటువంటి పరమపురుషుడు కేవలం అనన్య భక్తితోనే పొందతగినవాడు. |
puruṣaḥ sa paraḥ pārtha bhaktyā labhyas tv ananyayā।
O Partha ! All creatures dwell within Him, and He pervades the entire universe. — that Supreme Being, is attained only through unwavering, single-pointed devotion.
yasyāntaḥ-sthāni bhūtāni yena sarvam idaṁ tatam॥ 8.22॥
| यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः। प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ॥ 8.23॥ | యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః। ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ॥ 8.23॥ |
| हे भरतश्रेष्ठ ! जिस काल में शरीर त्याग कर गये हुए योगीजन अपुनरावृत्ति को, और (या) पुनरावृत्ति को प्राप्त होते हैं, वह काल मैं तुम्हें बताऊँगा।। | భరతవీరా ! యోగులు ఏ సమయంలో మరణిస్తే మళ్ళీ జన్మించరో, ఏ వేళ దేహం విడిచిపెడితే పునర్జన్మ పొందుతారో చెబుతాను విను. |
yatra kāle tv anāvṛttim āvṛttiṁ caiva yoginaḥ।
O best of the Bharatas! Now I shall explain the times at which departing yogis either return to this world or do not return.
prayātā yānti taṁ kālaṁ vakṣyāmi bharatarṣabha॥ 8.23॥
| अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम्। तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः॥ 8.24॥ | అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్। తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః॥ 8.24॥ |
| जो ब्रह्मविद् साधकजन मरणोपरान्त अग्नि, ज्योति, दिन, शुक्लपक्ष और उत्तरायण के छः मास वाले मार्ग से जाते हैं, वे ब्रह्म को प्राप्त होते हैं।। | అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, ఆరుమాసాల ఉత్తరాయణం—వీటిలో మరణించే బ్రహ్మోపాసకులకు బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. |
agniḥ jyotir ahaḥ śuklaḥ ṣaṇ-māsā uttarāyaṇam।
Those who know Brahman and depart during the time of fire, light, the bright fortnight, and the six months of the northern path (Uttarāyaṇa) attain Brahman.
tatra prayātā gacchanti brahma brahma-vido janāḥ॥ 8.24॥
| धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम्। तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते॥ 8.25॥ | ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్। తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే॥ 8.25॥ |
| धूम, रात्रि, कृष्णपक्ष और दक्षिणायन के छः मास वाले मार्ग से चन्द्रमा की ज्योति को प्राप्त कर, योगी (संसार को) लौटता है। | ధూమం, రాత్రి, కృష్ణపక్షం, దక్షిణాయనంలో శరీరం విడిచే యోగి చంద్రజ్యోతిని పొంది తిరిగి జన్మిస్తాడు. |
dhūmo rātris tathā kṛṣṇaḥ ṣaṇ-māsā dakṣiṇāyanam।
A yogi who departs during smoke, night, the dark fortnight, and the six months of the southern path (Dakṣiṇāyana) reaches the lunar light and returns again.
tatra cāndramasaṁ jyotir yogī prāpya nivartate॥ 8.25॥
| शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते। एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुनः॥ 8.26॥ | శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే। ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః॥ 8.26॥ |
| जगत् के ये दो प्रकार के शुक्ल और कृष्ण मार्ग सनातन माने गये हैं । इनमें एक (शुक्ल) के द्वारा (साधक) अपुनरावृत्ति को तथा अन्य (कृष्ण) के द्वारा पुनरावृत्ति को प्राप्त होता है।। | శుక్ల, కృష్ణ అనే రెండింటినీ జగత్తులో శాశ్వతమార్గాలుగా భావిస్తున్నారు. శుక్లమార్గంలో పయనించినవాడికి జన్మరాహిత్యమూ, కృష్ణమార్గంలో పోయినవాడికి పునర్జన్మమూ కలుగుతాయి. |
śukla-kṛṣṇe gatī hy ete jagataḥ śāśvate mate।
It is believed that there are two eternal paths in this world — the path of light (śukla) and the path of darkness (kṛṣṇa). One leads to non-return, the other to rebirth.
ekayā yāty anāvṛttim anyayā vartate punaḥ॥ 8.26॥
| नैते सृती पार्थ जानन् योगी मुह्यति कश्चन। तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन॥ 8.27॥ | నైతే సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన। తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున॥ 8.27॥ |
| हे पार्थ इन दो मार्गों को (तत्त्व से) जानने वाला कोई भी योगी मोहित नहीं होता। इसलिए, हे अर्जुन ! तुम सब काल में योगयुक्त बनो। | పార్థా! ఈ రెండు మార్గాలను గూర్చి తెలిసిన యోగి మాయలో పడడు. అందుచేత, అర్జునా! నీవు ఎల్లప్పుడు యోగానికి నిబద్ధుడవై ఉండు. |
naite sṛtī pārtha jānan yogī muhyati kaścana।
O Partha! A yogi who understands these two paths is never deluded. Therefore, O Arjuna, be steadfast in yoga at all times.
tasmāt sarveṣu kāleṣu yoga-yukto bhavārjuna॥ 8.27॥
| वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम्। अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम्॥ 8.28॥ | వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్। అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యమ్॥ 8.28॥ |
| योगी इसको (शुक्ल और कृष्णमार्गके रहस्यको) जानकर वेदोंमें, यज्ञोंमें, तपोंमें तथा दानमें जो-जो पुण्यफल कहे गये हैं, उन सभी पुण्यफलोंका अतिक्रमण कर जाता है और आदिस्थान परमात्माको प्राप्त हो जाता है। | యోగి ఈ శుక్ల మరియు కృష్ణ మార్గాల రహస్యాన్ని తెలుసుకొని వేదాల్లో, యజ్ఞాల్లో, తపస్సుల్లో మరియు దానాల్లో పేర్కొన్న అన్ని పుణ్యఫలాలను అధిగమించి, ఆదిస్థానమైన పరమాత్మను పొందుతాడు. |
vedeṣu yajñeṣu tapaḥsu caiva
Whatever meritorious results are declared in the Vedas, sacrifices, austerities, and charity — the yogi surpasses all these, and having understood this, attains the supreme, primal abode.
dāneṣu yat puṇya-phalaṁ pradiṣṭam।
atyeti tat sarvam idaṁ viditvā
yogī paraṁ sthānam upaiti cādyam॥ 8.28॥
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अक्षरब्रह्मयोगोनामाष्टमोऽध्यायः॥
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షరబ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః॥
Om Tat Sat — Thus, in the Upanishads of the glorious Bhagavad Gita, the science of Brahmavidya, the scripture of Yoga, in the dialogue between Sri Krishna and Arjuna, ends the eighth chapter entitled “The Yoga of the Imperishable Brahman.
